Kerala: పాత రికార్డులు బద్దలు కొట్టిన శబరిమల అయ్యప్ప!

  • మండల పూజ సీజన్ లో రికార్డు స్థాయి భక్తులు
  • రూ. 168 కోట్ల ఆదాయం
  • ఆల్ టైమ్ రికార్డన్న టీడీబీ
  • 30 నుంచి మకరజ్యోతి ఉత్సవాలు

ఈ సంవత్సరం మండల పూజ సీజన్ లో కేరళ, శబరిమలలోని అయ్యప్ప దేవాలయం రికార్డు స్థాయిలో భక్తులను ఆకర్షించి, భక్తులందించే కానుకల విషయంలో పాత రికార్డులను బద్దలు కొట్టింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26 వరకూ ఆలయంలో మండల పూజలు నిర్వహించగా, మొత్తం 168.84 కోట్ల ఆదాయం లభించింది. ఇది ఆల్ టైమ్ రికార్డని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ప్రతియేటా పెరుగుతోందని వారు అన్నారు. మకరజ్యోతి ఉత్సవాల కోసం ఈనెల 30న శబరిమల ఆలయాన్ని తిరిగి తెరవనున్నామని తెలిపారు.

Kerala
Sabarimala
Ayyappa
Revenue
  • Loading...

More Telugu News