narasimhan: తండ్రీకొడుకులు ఇద్దరూ కలసి సాధించిన విజయం ఇది: గవర్నర్ నరసింహన్

  • ఏపీకి సంతోషకరమైన రోజులు వచ్చాయి
  • టెక్నాలజీ ద్వారా ప్రజలకు చంద్రబాబు, లోకేశ్ ఆనందాన్ని అందిస్తున్నారు
  • అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు
  • ప్ర‌జ‌ల‌కు ప్రభుత్వం అత్యున్నతమైన సౌకర్యాలు కల్పించింది

ఏపీకి సంతోషకరమైన రోజులు వచ్చాయని, టెక్నాలజీ ద్వారా ప్రజలకు ఆనందాన్ని అందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయ‌న కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ విజయం సాధించారని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొనియాడారు. ఈ రోజు అమ‌రావ‌తిలో ఏపీ ఫైబర్ నెట్ ను ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేసిన విష‌యం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా న‌ర‌సింహ‌న్ మాట్లాడుతూ.... ఏపీలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ఆధునిక టెక్నాలజీతో అతి తక్కువ ధరకే ఇంటర్ నెట్, కేబుల్ టీటీ, టెలిఫోన్ అందిస్తున్నారని, అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ప్రభుత్వం అత్యున్నతమైన సౌకర్యాలు కల్పించిందని వ్యాఖ్యానించారు.  

narasimhan
Nara Lokesh
Chandrababu
  • Loading...

More Telugu News