Balakrishna: రేపు రంగంలోకి దిగుతోన్న బాలకృష్ణ .. ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ షూటింగ్!

  • ఎన్టీఆర్ బయోపిక్ కోసం అభిమానుల వెయిటింగ్ 
  • టీజర్ షూటింగ్ కి రెడీ అవుతోన్న బాలకృష్ణ 
  • ఎన్టీఆర్ వర్ధంతి రోజున రిలీజ్  

తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ ను నిర్మించడానికి బాలకృష్ణ సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు కూడా. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం వుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేసి .. అందరి దృష్టిని ఈ ప్రాజెక్టు వైపు మళ్లించడానికి ప్లాన్ చేశారు.

టీజర్ షూటింగును రేపు ఆరంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ షూటింగులో బాలకృష్ణ పాల్గొననున్నారు. జనవరి 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని టీజర్ ను రిలీజ్  చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. సాయిమాధవ్ బుర్రా సంభాషణలను అందిస్తోన్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం, నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

  • Loading...

More Telugu News