Andhra Pradesh: ఏపీ పరిశ్రమల శాఖలో పేపర్ లెస్ పాలన ప్రారంభం

  • పరిశ్రమల శాఖలో ల్యాప్ టాప్ ల పంపిణీ
  • ఇకపై అధికారులందరూ ల్యాప్ టాప్ లు ఉపయోగించాలి
  • పరిశ్రమల శాఖ మంత్రి  అమరనాథరెడ్డి

ఏపీ పరిశ్రమల శాఖలో పేపర్ లెస్ పాలన మొదలైంది. పరిశ్రమల శాఖలోని ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ (ఐపీఓ) నుంచి జాయిండ్ డైరెక్టర్ స్థాయి వ్యక్తులందరికీ ఈరోజు ల్యాప్ టాప్ లు పంపిణీ చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి ఎన్. అమరనాథరెడ్డి తన పేషీలో వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేపర్ లెస్ పాలన ద్వారా పనులు వేగవంతంగా జరుగుతాయని చెప్పారు. ఇకపై అధికారులందరూ ల్యాప్ టాప్ లను ఉపయోగించాలని, మరింత వేగవంతంగా, పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. 

Andhra Pradesh
amarnath reddy
  • Loading...

More Telugu News