Ram Nath Kovind: చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై రాష్ట్రపతి ప్రశంసల జల్లు

  • రియల్ టైమ్ గవర్నెన్స్ లో ఏపీ కృషి అభినందనీయం
  • జాతీయ స్థాయిలో ప్రజెంటేషన్ ఇవ్వాలి
  • టెక్నాలజీ ఇంటిగ్రేషన్ తో సాంకేతిక రంగంలో అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్ లో రియల్ టైమ్ గవర్నెన్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు సాధించడం పట్ల భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ రోజు అమరావతి సచివాలయంలోని మొదటి భవనంలోని రాష్ట్ర స్థాయి రియల్ టైమ్ గవర్నెన్స్, కమాండ్ కంట్రోలు కేంద్రాన్ని రాష్ట్రపతి సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ విధానంపై రాష్ట్రపతికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్, ఆర్టీజీ వంటి వినూత్న విధానాలు చేపట్టడం ద్వారా టెక్నాలజీ ఇంటిగ్రేషన్ తో సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధిస్తోందని కొనియాడారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో సాధించిన ఫలితాలు కేవలం ఏపీకే పరిమితం కాకుండా దేశమంతటికీ ఇవి ఉపయోగపడే రీతిలో జాతీయ స్థాయిలో ఆర్టీజీపై ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్రపతి అన్నారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.

    

  • Loading...

More Telugu News