Telugudesam: ఏపీ టీడీపీ ఎమ్మెల్యే యరపతినేనికి పితృవియోగం

  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యరపతినేని తండ్రి
  • చికిత్స పొందుతూ హైదరాబాద్ నిమ్స్ లో లక్ష్మయ్య మృతి
  • రెంటచింతల మండలం దుర్గిలో రేపు అంత్యక్రియలు

ఏపీ టీడీపీ నేత, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తండ్రి లక్ష్మయ్య ఈరోజు మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మయ్య, హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన ఈరోజు సాయంత్రం మృతి చెందారు. వీరి స్వగ్రామమైన రెంటచింతల మండలం దుర్గిలో లక్ష్మయ్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. కాగా, యరపతినేని తండ్రి మృతిపై టీడీపీ నాయకులు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Telugudesam
yarapatineni
  • Loading...

More Telugu News