britain: ఒక్క ఫొటోతో ల‌క్షాధికారి అయిన బ్రిట‌న్‌ మ‌హిళ‌!

  • రాయ‌ల్ కుటుంబాన్ని ఒకే ఫొటోలో బంధించిన కారెన్ ముర్దోచ్‌
  • వైర‌ల్ అయిన ఫొటో
  • కొన‌డానికి ముందుకు వ‌చ్చిన వార్తా సంస్థ‌లు

ఒక్కోసారి అదృష్టం ఏ రూపంలో క‌లిసి వ‌స్తుందో చెప్ప‌లేం. బ్రిట‌న్‌కి చెందిన కారెన్ ముర్దోచ్‌కి మాత్రం ఓ ఫొటో తీయ‌డం ద్వారా క‌లిసి వ‌చ్చింది. మ‌రి ఈమె ఫొటో తీసింది మామూలు వ్య‌క్తుల‌ను కాదు... రాజ‌కుటుంబీకుల‌ను. ప్రిన్స్ విలియం, ఆయ‌న భార్య కేట్‌, ప్రిన్స్ హ్యారీ, ఆయ‌న‌కు కాబోయే మేగ‌న్ మార్కెల్‌ల‌ను కారెన్ ఒకే ఫొటోలో బంధించింది. అలాగ‌ని కారెన్ వృత్తి రీత్యా ఫొటోగ్రాఫ‌ర్ కాదు.. అక్క‌డి క్వీన్ ఎలిజ‌బెత్ ఆసుప‌త్రిలో న‌ర్సు.

క్రిస్‌మ‌స్ సంద‌ర్భంగా రాజ‌కుటుంబం నిర్వ‌హించిన పార్టీని చూడ‌టానికి అంద‌రితో పాటు ఆమె కూడా వెళ్లింది. అక్క‌డ వారి న‌లుగురిని ఆమె అనుకోకుండా ఫొటో తీసింది. త‌ర్వాత ఆ ఫొటోను `ఫ్యాబ్ ఫోర్‌` అని ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. అంతే... ఒక్క‌రోజులో ఆ ఫొటో వైర‌ల్‌గా మారింది. ఆ ఫొటోను త‌మ ప‌త్రిక‌ల్లో ప్ర‌ధానంగా ప్ర‌చురించుకునేందుకు బ్రిట‌న్‌కి చెందిన ప్ర‌ధాన వార్తాప‌త్రిక‌ల‌న్నీ కారెన్‌ని సంప్ర‌దించాయి. ఫొటో ఒరిజిన‌ల్ హ‌క్కుల‌ను కొన‌డానికి ముందుకొచ్చాయి. దీంతో ఆ ఫొటో ఖ‌రీదు నిర్ణ‌యించడానికి క‌రెన్ ఓ ఏజెంట్‌ను కూడా పెట్టుకోవాల్సి వ‌చ్చింది.

మొత్తానికి ఈ ఫొటో ద్వారా త‌న కూతురు చ‌దువుకి కావాల్సిన డ‌బ్బు స‌మ‌కూరితే చాల‌ని కారెన్ అనుకుంటోంది. ఏజెంట్ లెక్క‌ల ప్ర‌కారం, ఈ ఫొటో 27000 పౌండ్ల వ‌ర‌కు ధ‌ర ప‌లికే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News