sharathkumar: అది నాకు ఫస్టు సినిమా .. విజయశాంతి నన్ను తెగ తిట్టేసింది: శరత్ కుమార్

  • తెలుగులో ఫస్టు ఛాన్స్ వచ్చింది
  • విజయశాంతితో పెద్ద డైలాగ్ చెప్పాల్సి వచ్చింది 
  • ఏడెనిమిది టేకులు తీసుకున్నాను
  • అప్పుడు తిట్టేసి ఆ తరువాత సారీ చెప్పేసింది  

తమిళ ప్రేక్షకులను ప్రభావితం చేసిన సీనియర్ మాస్ హీరోలలో శరత్ కుమార్ ఒకరు. తెలుగులోనూ ఆయన కొన్ని సినిమాల్లో నటించారు. ఇక ఈ మధ్యన ఆయన తెలుగు సినిమాలలో ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

"తమిళ సినిమాలు చేయాలని వచ్చిన నాకు .. ముందుగా తెలుగులో చేసే ఛాన్స్ వచ్చింది .. ఆ సినిమా పేరే 'సమాజంలో స్త్రీ'. ఆ సినిమాకి నా స్నేహితుడే నిర్మాత .. ఆ సినిమాలో చేసే ఒక ఆర్టిస్ట్ రాకపోవడంతో నన్ను చేయమన్నారు. అప్పటికి నాకు అస్సలు తెలుగు రాదు. గొల్లపూడి మారుతీరావు .. రావు గోపాలరావు .. సుమన్ .. భానుచందర్ .. విజయశాంతి లాంటి ఆర్టిస్టులతో కలిసి నటించవలసి వచ్చింది.

 ట్రాలీ షాట్ పెట్టారు .. నేను విజయశాంతి దగ్గరికి నడిచి వెళుతూ పెద్ద డైలాగ్ చెప్పాలి. కొత్త కావడం వలన ఏడెనిమిది టేకులు తీసుకున్నాను. దాంతో విజయశాంతికి కోపం వచ్చేసి .. " ఎవరిని పడితే వాళ్లని కేరక్టర్స్ లో పెట్టేస్తున్నారు .. నాకు ఫ్లైట్ టైమ్ అవుతోంది" అంటూ తిట్టేశారు. ఆ తరువాత నేను 'స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్' లో మెయిన్ విలన్ గా చేశాను. అప్పుడు నన్ను విజయశాంతి గుర్తు పట్టలేదు. గతంలో మీరు నన్ను తిట్టారు .. అంటూ నేనే గుర్తు చేశాను. 'అయ్యో అవునా, అంటూ సారీ చెప్పారు' అంటూ నవ్వేశారు.     

  • Loading...

More Telugu News