Virat Kohli: కోహ్లీ రిసెప్షన్ కు హాజరైన కుంబ్లే.. నెటిజన్ల ప్రశంసలు!

  • భార్యతో కలసి విచ్చేసిన కుంబ్లే
  • విభేదాలు సమసిపోయినట్టేనా?
  • హుందాగా వ్యవహరించారంటూ నెటిజన్ల కామెంట్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేల మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయినట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా టూర్ లో సిరీస్ గెలిచే సత్తా కోహ్లీ జట్టుకు ఉందంటూ ఇటీవల కుంబ్లే వ్యాఖ్యానించాడు. అంతేకాదు, కోహ్లీ-అనుష్క శర్మల రిసెప్షన్ కు కూడా తన సతీమణితో కలసి హాజరయ్యాడు.

దీనిపై నెటిజన్లు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. గొడవలను పక్కనబెట్టి కుంబ్లేను కోహ్లీ ఆహ్వానించాడని, కుంబ్లే కూడా హాజరయ్యాడని... ఇది వీరిద్దరి హుందాతనాన్ని చాటుతోందని కామెంట్ చేస్తున్నారు. ఈ గొడవలన్నీ ఆటలో భాగమేనని, వ్యక్తిగతం కాదని మరి కొందరు అంటున్నారు.

Virat Kohli
Anushka Sharma
anil kumble
  • Loading...

More Telugu News