Ram Nath Kovind: తాను మాట్లాడుతుంటే ఇదేం పనంటూ చురకలంటించిన రామ్ నాథ్ కోవింద్!

  • రాష్ట్రపతి ప్రసంగిస్తుండగానే ఆహార పొట్లాల పంపిణీ
  • ఆహారం కోసం పరుగులు పెట్టిన ఆహూతులు
  • వేదికపై నుంచే చురకలు అంటించిన రామ్ నాథ్

ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సులో నిర్వాహకుల అత్యుత్సాహం కారణంగా తీవ్ర గందరగోళం ఏర్పడింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా, గవర్నర్ నరసింహన్, చంద్రబాబులతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్న ఈ సదస్సు ప్రారంభోపన్యాసం ముగియకుండానే, వచ్చిన వారికి ఆహార పొట్లాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం గందరగోళానికి దారితీసింది.

 ఆహార పొట్లాల కోసం స్టూడెంట్స్ తో పాటు సదస్సుకు వచ్చిన వారు పరుగులు పెట్టడంతో సభ రసాభాసగా మారింది. రాష్ట్రపతి రామ్ నాథ్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఇది జరగడంతో, ఆయన చురకలంటించారు. తన ప్రసంగానికి ఆటంకం కలిగించిన నిర్వాహకుల తీరును ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. ఫుడ్ ప్యాకెట్ల పంపిణీని కాసేపు ఆపాలంటూ వేదికపై నుంచే ఆయన కోరడం గమనార్హం. ఆహారాన్ని అందించడం తప్పు కాదని, అయితే, అది సభకు ఆటంకం కలిగించేలా ఉండ కూడదని హితవు పలికారు.

Ram Nath Kovind
Chandrababu
Narasimhan
IEA
Food Packets
  • Error fetching data: Network response was not ok

More Telugu News