TRS MPS: తక్షణం హైకోర్టును విభజించండి... తమ ఆందోళనతో లోక్ సభను వాయిదా వేయించిన టీఆర్ఎస్!

  • హైకోర్టును తక్షణం విభజించండి
  • లోక్ సభలో టీఆర్ఎస్ వాయిదా తీర్మానం
  • చర్చకు పట్టుబట్టిన ఎంపీలు
  • నిరాకరించడంతో నినాదాలు

తెలుగు రాష్ట్రాల హైకోర్టును తక్షణమే విభజించాలని డిమాండ్ చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని వెల్ లోకి దూసుకెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నినాదాలు చేస్తుండటం, వారికి కొన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు పలకడంతో లోక్ సభను వాయిదా వేశారు. అంతకుముందు వెంటనే హైకోర్టు విభజనకు కేంద్రం పూనుకోవాలని డిమాండ్ చేస్తూ, వాయిదా తీర్మానాన్ని టీఆర్ఎస్ ఎంపీలు సభాపతికి అందించగా, ఆయన దాన్ని తిరస్కరించారు. మరో మార్గంలో రావాలని సూచించారు. దీనికి అంగీకరించని ఎంపీలు నినాదాలు చేస్తూ పోడియంలోకి దూసుకెళ్లారు. సంయమనం పాటించాలని స్పీకర్ చేసిన విజ్ఞప్తులను వారు ఖాతరు చేయక ఆందోళన కొనసాగించారు. దీంతో చేసేదేమీ లేక సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

TRS MPS
Loksabha
High Court
  • Loading...

More Telugu News