google: పిక్సెల్ అమ్మకాలను పెంచడానికి భారత్‌లో స్టోర్లను తెరవనున్న గూగుల్?
- మొదటిసారి భారత్‌లో స్టోర్
- శాంసంగ్, షియోమీలకు పోటీగా?
- స్పందించని ఆల్ఫాబెట్
గూగుల్ సంస్థ ఇటీవల విడుదల చేసిన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలను పెంచడానికి భారత్‌లో స్టోర్లను తెరిచేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ స్టోర్లను తెరవడానికి గూగుల్ యత్నిస్తోందని కంపెనీ మార్కెటింగ్ శాఖలో పనిచేసే విశ్లేషకులు చెబుతున్నారు. వీటి ద్వారా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లను ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మనున్నట్లు వారు పేర్కొన్నారు. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే.. భారత్‌లో గూగుల్ తెరవనున్న మొదటి స్టోర్లు ఇవే అవుతాయి. ఇప్పటి వరకు గూగుల్ ఫోన్ల అమ్మకాలు ఆన్‌లైన్ ద్వారానో, థర్డ్ పార్టీ సంస్థల ద్వారానో జరిగేవి.
మొబైల్ వినియోగదారులను ఎక్కువగా కలిగి వున్న దేశాలలో ప్రపంచంలోనే రెండో పెద్ద దేశమైన భారత్‌లో తమ మార్కెట్‌ను విస్తృత పరుచుకునేందుకు గూగుల్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తూనే ఉంది. ఇక స్టోర్లు తెరవడం ద్వారా ఇప్పటికే పాగా వేసిన శాంసంగ్, షియోమీ, ఒప్పో, వీవో వంటి మొబైల్ తయారీ సంస్థలకు గట్టి పోటీ ఏర్పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.