raviteja: రవితేజ సరసన కొత్త హీరోయిన్!

  • రవితేజతో కల్యాణ్ కృష్ణ 
  • హీరోయిన్ గా మాళవిక శర్మ 
  • వచ్చేనెలలో సెట్స్ పైకి

రవితేజ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'టచ్ చేసి చూడు' రెడీ అవుతోంది. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రవితేజ తదుపరి సినిమాకి రంగం సిద్ధమవుతోంది. రవితేజ తన తదుపరి సినిమాను, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి మాళవిక శర్మను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

 వచ్చేనెల మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాకి శక్తికాంత్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. 'సోగ్గాడే చిన్నినాయనా' .. 'రారండోయ్ వేడుక చూద్దాం'తో రెండు హిట్స్ అందుకున్న కల్యాణ్ కృష్ణ, రవితేజ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి.  

  • Loading...

More Telugu News