Lala Lajpat Rai Medical College: రష్యన్ బెల్లీ డ్యాన్సర్ల చిందు.. అంబులెన్స్‌లో మద్యం.. మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఘటన.. యూపీ సీఎం సీరియస్!

  • పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఏరులై పారిన మద్యం
  • డ్యాన్సులతో హోరెత్తించిన రష్యన్ బెల్లీ డ్యాన్సర్లు
  • సీఎం యోగి సీరియస్..విచారణకు ఆదేశం

రష్యన్ బెల్లీ డ్యాన్సర్ల స్టెప్పులు, ఏరులై పారిన మద్యం.. సాధారణంగా ఇటువంటి సీన్లు బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా మీరట్‌లోని లాలా లజపత్ రాయ్ మెడికల్ కాలేజీలోనూ ఇటువంటి దృశ్యం కనిపించింది. ఇప్పుడీ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.1992 బ్యాచ్‌కు చెందిన వైద్యులు తాజాగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఓల్డ్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు.

అంతవరకు బాగానే ఉన్నా.. ఈ కార్యక్రమానికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో ఒకటి ఇప్పుడు సంచలనం రేపింది. బయట ఆసుపత్రి ఆవరణలో నిలిపి ఉంచిన అంబులెన్స్ నిండా మద్యం బాటిళ్లు ఉన్నాయి. బార్ టెండర్లు, క్రిస్మస్ క్యాప్‌లను ధరించిన అమ్మాయిలు వైద్యులకు మద్యం పోస్తూ కనిపించారు. ఆ తర్వాత ఆ అమ్మాయిలు బాలీవుడ్ పాటలకు బెల్లీ డ్యాన్స్‌లతో హోరెత్తించారు.

ఈ ఘటన వైరల్ కావడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. జిల్లా మేజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌‌లను మందలించారు. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని, మీడియా ద్వారానే తనకూ తెలిసిందని తాత్కాలిక ప్రిన్సిపాల్ వినయ్ అగర్వాల్ తెలిపారు.

Lala Lajpat Rai Medical College
Uttar Pradesh
Meerut
  • Loading...

More Telugu News