devineni: ఏపీ మంత్రి దేవినేని కారుకు సడెన్ బ్రేక్.. తప్పిన ప్రమాదం

  • బెంగళూరు నుంచి అనంతపురం వెళ్తుండగా సంఘటన
  • హంద్రీనీవా కాలువ చూసేందుకు కారును ఆపమన్న మంత్రి
  • సడెన్ బ్రేక్ వేయడంతో దేవినేని కారును ఢీకొట్టిన కాన్వాయ్ లోని మరో కారు 

ఏపీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమాకు ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి అనంతపురంకు కారులో వెళ్తున్న సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. హంద్రీనీవా కాలువను చూసేందుకు కారును ఆపాలని తన డ్రైవర్ కు ఉమ సూచించగా, సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో, మంత్రి కారుని కాన్వాయ్ లోని మరో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో దేవినేనికి ఎటువంటి ప్రమాదం జరలేదని, సురక్షితంగా బయటపడ్డారని సంబంధిత వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News