agnyathavasi: విడుద‌లకు ముందే మ‌రో రికార్డు కొడుతున్న 'అజ్ఞాతవాసి'!

  • అమెరికాలోని ప్రతిష్ఠాత్మ‌క థియేట‌ర్లో ప్ర‌ద‌ర్శ‌న‌
  • ఇక్క‌డ ప్ర‌ద‌ర్శితం కాబోతున్న మొద‌టి భార‌తీయ చిత్రంగా రికార్డు
  • ఇప్ప‌టికే మంచి టాక్ తెచ్చుకున్న టీజ‌ర్‌, ఆడియో

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `అజ్ఞాతవాసి` చిత్రం విడుద‌లకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే టీజ‌ర్‌కి అత్య‌ధిక వీక్ష‌ణ‌లు పొందడంతో ఈ చిత్రం రికార్డు కొట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో ఘ‌న‌త‌ను ఈ చిత్రం సాధించనున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లోని యూనివర్శల్‌ స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారట. అక్కడి సిటీ వాక్‌ థియేటర్స్‌లో ప్రదర్శించబోయే తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం.

ఈ విషయానికి సంబంధించిన పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 2018 జనవరి 9న ఈ చిత్రాన్ని సిటీ వాక్‌ థియేటర్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు, టీజర్‌ మంచి టాక్‌ అందుకున్నాయి. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News