kurnool mlc election: కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ వీరి మధ్యే.. తప్పుకున్న వైసీపీ

  • నామినేషన్ వేసిన కేఈ ప్రభాకర్
  • బరిలో బీఎస్పీ, ఇద్దరు ఇండిపెండెంట్లు
  • టీడీపీ విజయం లాంఛనమే

కర్నూలు ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు కాసేపట్లో ముగియనుంది. ఇప్పటి వరకు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి కేఈ ప్రభాకర్ నామినేషన్ వేశారు. బీఎస్పీ నుంచి దండు శేషు యాదవ్ బరిలోకి దిగారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు, మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాశ్ రెడ్డిలు నామినేషన్ వేశారు.

వైసీపీ తరపున గౌరు వెంకటరెడ్డి నామినేషన్ వేయాలని భావించినా... జగన్ అనుమతించకపోవడంతో, పోటీ నుంచి తప్పుకున్నారు. నామినేషన్ ఉపసంహరణకు రేపు చివరి తేది. ప్రతిపక్షం బరిలో లేకపోవడంతో టీడీపీ విజయం లాంఛనమే. 

kurnool mlc election
ke prabhakar
Telugudesam
  • Loading...

More Telugu News