gali janardhan reddy: కంట్రోల్ కోల్పోయి చంద్రబాబుపై దారుణమైన భాష వాడా.. ఆ తర్వాత చాలాసార్లు బాధపడ్డా: గాలి జనార్దన్ రెడ్డి

  • నియంత్రించుకోలేక పోయా
  • మితిమీరిన భాషను ఉపయోగించా
  • ఇలా ఎందుకు ప్రవర్తించానా అంటూ బాధపడ్డా

ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఒకానొక సమయంలో హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. హైదరాబాదులోని తన నివాసంపై తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పుకున్న కొందరు దాడి చేశారని, ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబును వర్ణించలేని భాషలో తిట్టారు.

ఈ వ్యాఖ్యలపై ఏబీఎన్ చానల్ లో వచ్చిన 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో గాలి స్పందించారు. ఆనాడు ఆయన మాట్లాడిన వీడియోను లైవ్ లో ప్లే చేయగా... 'ఇంక చాలు, వీడియోను ఆపేయండి' అంటూ నవ్వుతూ అన్నారు. అనంతరం మాట్లాడుతూ, తన ఇంటిపై దాడి జరిగిందన్న భావోద్వేగంతోనే తాను అలా మాట్లాడానని చెప్పారు. ఆనాటి వ్యాఖ్యలపై తాను ఎన్నోసార్లు బాధపడ్డానని, అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అనుకున్నానని తెలిపారు. ఆ క్షణంలో అది జరగకుండా ఉండాల్సిందని చెప్పారు. విమర్శలకు ప్రతి విమర్శలు మాత్రమే చేస్తే బాగుండేదని... కానీ, మాట్లాడుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి, మితిమీరిన భాషను వాడానని అన్నారు. ఇలాంటి భాష అనవసరంగా వాడానని ఎన్నోసార్లు బాధపడ్డానని చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News