Allu Arjun: మరోసారి అభిమానులను హెచ్చరించిన అల్లు అర్జున్

  • ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడరాదు
  • అది సంస్కారం కాదు
  • అలాంటి వారిని నేను నిలదీస్తా

అల్లు శిరీష్ తాజా చిత్రం 'ఒక్క క్షణం' ప్రీరిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతుండగా, ఫ్యాన్స్ గోలగోల చేశారు. దీంతో, ఫ్యాన్స్ కు బన్నీ హెచ్చరికలు జారీ చేశాడు. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఎదురు మాట్లాడటం సంస్కారం కాదని చెప్పాడు.

ఫంక్షన్ పెట్టేదే సరదాగా ఎంజాయ్ చేయడానికని, అరచి గోల చేయవచ్చని, అయితే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండాలని అన్నాడు. ఇది బేసిక్ కాన్వర్జేషన్ అని తెలిపాడు. తమలోని ఫీలింగ్స్ ను ఒకరు చెప్పుకునేటప్పుడు అడ్డుపడరాదని చెప్పాడు. ఇలాంటి పనులు చేసే వారిని తాను కచ్చితంగా నిలదీస్తానని అన్నాడు.



Allu Arjun
allu sirish
  • Error fetching data: Network response was not ok

More Telugu News