tv serial on vangaveeti ranga: వంగవీటి రంగా అంటే ఏమిటో ఈ సీరియల్ ద్వారా చూపిస్తా!: నటుడు జీవీ నాయుడు

  • దాసరి సూచనల మేరకే సీరియల్
  • రంగా ఘనతను చాటేలా ఉంటుంది
  • వర్మ సినిమాలా కాదు.. వాస్తవాలు ఉంటాయి

దివంగత వంగవీటి మోహన రంగా జీవిత చరిత్ర ఆధారంగా టీవీ సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ ను సినీ నటుడు జీవీ నాయుడు నిర్మించనున్నారు. నేడు రంగా 29వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం 150 ఎపిసోడ్లతో రంగా జీవిత చరిత్ర ఆధారంగా టీవీ సీరియల్ తీస్తున్నానని చెప్పారు. రంగా ఘనత చాటేలా ఈ సీరియల్ ఉంటుందని అన్నారు.

దివంగత దాసరి నారాయణరావు సూచనల మేరకే తాను ఈ సీరియల్ ను తీస్తున్నానని చెప్పారు. రంగా చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీశారని... అయితే, ఎడిట్ చేసిన సినిమానే ఆయన బయటకు వదిలారని అన్నారు. తన సీరియల్ లో వాస్తవాలు ఉంటాయని చెప్పారు. 

tv serial on vangaveeti ranga
vangaveeti ranga serial
gv naidu
  • Loading...

More Telugu News