pajnagutta flyover: రక్తసిక్తమైన పంజాగుట్ట ఫ్లైఓవర్.. విద్యార్థి దుర్మరణం

  • మద్యం సేవించడం, హై స్పీడే ప్రమాదానికి కారణం
  • అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన అనీష్
  • మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్ పై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిన్న అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం సేవించడమే కాకుండా, మితి మీరిన వేగం కూడా ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే, హైస్పీడ్ టూ వీలర్ పై అనీష్ భార్గవ్ అనే డిగ్రీ విద్యార్థి, అతని స్నేహితుడు వంశీ పంజాగుట్ట ఫ్లైఓవర్ పై వెళుతున్నారు. ఫ్లైఓవర్ మలుపు వద్ద రైట్ సైడ్ డివైడర్ ను వారు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వారి వాహనం దాదాపు వంద మీటర్ల దూరం వరకు పల్టీలు కొట్టుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో అనీష్ భార్గవ్ తలకు తీవ్ర గాయం కావడంతో... అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. వెనుక కూర్చున్న వంశీ కాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

pajnagutta flyover
accident on pajagutta flyover
  • Loading...

More Telugu News