Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • యూకేలో ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ 
  • ప్రభాస్ తో తమిళ దర్శకుడి ప్రాజక్ట్ 
  • మహేశ్ మరోసారి లుంగీ డ్యాన్స్ 
  • లాయర్ వేషంలో జగపతిబాబు

*  'డీజే' చిత్రం తర్వాత తాజాగా 'సాక్ష్యం' చిత్రంలో నటిస్తున్న కన్నడ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం యూకే టూర్ చేస్తోంది. మిత్రులతో కలసి మాంచెస్టర్ లో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ, న్యూ ఇయర్ వేడుకలను కూడా అక్కడే జరుపుకుంటుందట. ఇక జనవరి మొదటి వారంలో ఇక్కడికి వచ్చి షూటింగులో పాల్గొంటుంది.
*  ఇటీవల విజయ్ తో 'మెర్సల్' వంటి భారీ హిట్ చిత్రాన్ని తీసిన తమిళ దర్శకుడు అట్లీ కుమార్ త్వరలో ప్రభాస్ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
*  గతంలో 'పోకిరి' సినిమాలో 'చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా..' పాటలో లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేసిన మహేశ్ బాబు మళ్లీ ఇప్పుడు మరో పాటలో లుంగీ కడుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'భరత్ అనే నేను' సినిమాలో ఓ పాటలో మహేశ్ లుంగీతో డ్యాన్స్ చేస్తాడట.
*  ప్రముఖ నటుడు జగపతిబాబు పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. నారా రోహిత్ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆటగాళ్లు' చిత్రంలో జగపతిబాబు ఇలా లాయర్ వేషం వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.

  • Loading...

More Telugu News