Gujarath: గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ రేపు ప్రమాణ స్వీకారం.. ఏపీ నుంచి యనమల హాజరు!

  • గాంధీనగర్ లో రేపు ఉదయం ప్రమాణ స్వీకార కార్యక్రమం
  • గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి రావడం వరుసగా ఆరోసారి
  • ఈ కార్యక్రమానికి హాజరుకానున్న పలువురు ప్రముఖులు

గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ  ప్రమాణస్వీకారం చేయనున్నారు. గాంధీనగర్ లో రేపు ఉదయం పదకొండు గంటలకు నిర్వహించే కార్యక్రమంలో విజయ్ రూపానీ, ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు  అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జితు వఘానీ  పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి యనమల రామకృష్ణుడు హాజరుకానున్నట్టు సమాచారం. కాగా, గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం వరుసగా ఆరోసారి. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన మెజార్టీ సాధించలేకపోవడం గమనార్హం. 

Gujarath
Narendra Modi
  • Loading...

More Telugu News