rishi kapoor: 'మెర్రీ క్రిస్‌మ‌స్' అంటూ మ‌ద్యం బాటిల్ ఉన్న‌ వివాదాస్ప‌ద ఫొటో పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరో!

  • స్వామీజీ, ఓ ముస్లిం మ‌త గురువు కూర్చుని మందు తాగుతున్న‌ట్లు ఫొటో
  • 'స్పిరిట్ అంటే ఇది' అన్న రిషి 
  •  నెటిజన్ల మండిపాటు 

'మెర్రీ క్రిస్‌మ‌స్' అంటూ మ‌ద్యం బాటిల్ ఉన్న ఓ వివాదాస్ప‌ద ఫొటోను బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రిషి కపూర్ పోస్ట్ చేశారు. అందులో ఓ స్వామీజీ, ఓ ముస్లిం మ‌త గురువు కూర్చుని ఉన్నారు. ముస్లిం మ‌త గురువు హిందువుకి మందు పోస్తున్నాడు. 'స్పిరిట్ అంటే ఇది' అంటూ రిషి క‌పూర్ దానికి కామెంట్ రాశాడు.

'విశ్వాసాల పరంగా విడిపోయినప్పటికీ, బాటిల్ పరంగా వాళ్లు ఒకటవుతార'ని ఆయ‌న చమత్కారంతో కూడిన ట్వీట్ చేశారు. రిషిక‌పూర్ ఓ ఫేక్ ఫొటోను పోస్ట్ చేశార‌ని నెటిజ‌న్లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

rishi kapoor
Bollywood
tweet
cristmas
  • Error fetching data: Network response was not ok

More Telugu News