Mahesh Babu: మహేష్ బాబు లాంటి స్టార్ ని నేను ఇంతవరకూ చూడలేదు: హీరోయిన్ కైరా అద్వానీ

  • తెలుగు సినిమాల్లో నటిస్తుండటం ఇదే తొలిసారి
  • నాకు చాలా సంతోషంగా ఉంది
  • హైదరాబాద్ నాకు బాగా నచ్చింది: ‘భరత్ అను నేను’ హీరోయిన్

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భరత్ అను నేను’. ఈ చిత్రంలో మహేశ్ సరసన నటిస్తున్న బాలీవుడ్ భామ కైరా అద్వానీ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో బ్రైడల్ బొటిక్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా పలుకరించిన మీడియాతో ఆమె మాట్లాడుతూ, తెలుగు సినిమాల్లో తాను నటిస్తుండటం తొలిసారి అని, తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. మహేష్ బాబు లాంటి స్టార్ నటుడిని తానింత వరకూ చూడలేదని ప్రశంసించిన కైరా అద్వానీ, ఈ చిత్రం షూటింగ్ జరుగుతోందని చెప్పింది. తనకు హైదరాబాద్ బాగా నచ్చిందని, ఇక్కడి ప్రజలు తనను ఆదరిస్తున్నారని పేర్కొంది.

  • Loading...

More Telugu News