Tirumala: తిరుమలలో నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు.. నిందితుల అరెస్టు!

  • చిత్తూరుకు చెందిన వాసు అనే దళారి  
  • వాసుకు సహకరిస్తున్న టీటీడీ కౌంటర్ సిబ్బంది
  • విజిలెన్స్ అధికారుల అదుపులో నిందితులు

తిరుమలలో నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల గుట్టు రట్టయింది. నకిలీ టికెట్ల ద్వారా శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులను కౌంటర్ సిబ్బంది అనుమతిస్తుండగా, టీటీడీ విజిలెన్స్ అధికారులు ఈరోజు పట్టుకున్నారు. చిత్తూరుకు చెందిన వాసు అనే దళారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.300 విలువైన ప్రత్యేక దర్శనం నకిలీ టికెట్లను వందల సంఖ్యలో భక్తులకు అంటకడుతున్న వాసు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది.

కౌంటర్ సిబ్బందితో వాసు కుమ్మక్కై ఈ దందాకు పాల్పడుతున్నాడని, ఈ వ్యవహారానికి సంబంధించి మూడు నెలల క్రితమే అతను జైలు శిక్ష అనుభవించి వచ్చాడని అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనలో కౌంటర్ సిబ్బంది సురేంద్ర, కనకరాజులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

కాగా, ఈ నెలలో ఇటువంటి సంఘటన వెలుగు చూడటం ఇది రెండోసారి. శ్రీవారి దర్శనం కోసం ముంబైకు చెందిన భక్తుల బృందం కొనుగోలు చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నకిలీవని తేలింది.

  • Loading...

More Telugu News