Narendra Modi: మా ముఖ్యమంత్రిని పిలవరా? మేమిచ్చిన 50 శాతం డబ్బులను కక్కండి!: కేంద్రంపై ఆప్ ధ్వజం

  • ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్ ను ప్రారంభించిన మోదీ
  • కేజ్రీవాల్ కు అందని ఆహ్వానం
  • మండిపడ్డ ఆప్ నేతలు

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఈ మెట్రో లైన్ నిర్మాణానికి తమ ప్రభుత్వం 50 శాతం డబ్బులు చెల్లించిందని... ఆ డబ్బులన్నింటినీ తిరిగి కక్కాలని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ అన్నారు.

 ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఫరీదాబాద్ కారిడార్ ప్రారంభోత్సవం సమయంలో కూడా ఇదే విధంగా కేజ్రీవాల్ కు ఆహ్వానం పంపలేదని ఆయన మండిపడ్డారు. కేజ్రీవాల్ పై మోదీ ప్రభుత్వానికి ఉన్న వ్యక్తిగత శత్రుత్వాన్ని ఇది సూచిస్తోందని అన్నారు. కేజ్రీని బీజేపీ నేతలు ఏహ్యభావంతో చూస్తున్నారని మండిపడ్డారు. 

Narendra Modi
aravind kejrival
delhi metro line
  • Loading...

More Telugu News