ttv dinakaran: దినకరన్ ఓ పెద్ద 420: ధ్వజమెత్తిన పన్నీర్ సెల్వం
- ఈ విషయాన్ని ఆయనే మాతో చెప్పారు
- ఆయన ఇప్పుడు చెబుతున్నవన్నీ అబద్ధాలే
- దినకరన్ పై పన్నీర్ ఫైర్
శశికళ మేనల్లుడు, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన టీటీవీ దినకరన్ పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దినకరన్ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని మండిపడ్డారు. అతనొక 420 అని... తానొక పెద్ద 420 అనే విషయాన్ని స్వయంగా ఆయనే తమతో చెప్పారని అన్నారు.
ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ 40 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అన్నాడీఎంకేపై దినకరన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. మరోవైపు ఓపీఎస్, ఈపీఎస్ వర్గీయుల్లో కొందరు దినకరన్ వర్గంలోకి చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.