hafeez saeed: పాక్ రాజకీయాల్లో కీలక మలుపు.. లాహోర్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్
- ఎంఎంఎల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన హఫీజ్ సయాద్
- పాక్ ప్రభుత్వ హెచ్చరికలు బేఖాతరు
- పాక్ రాజకీయాల్లో కూడా ఉగ్రవాదం చొరబడుతుందంటూ ఆందోళన
కరుడుగట్టిన ఉగ్రవాది, ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్, జమాత్ ఉద్దవా అధినేత హఫీజ్ సయాద్ లాహోర్ లో పార్టీ కార్యాలయ్యాన్ని ప్రారంభించాడు. పాక్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పట్టించుకోని హఫీజ్... మిల్లి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పార్టీ కార్యాలయాన్ని నిన్న ప్రారంభించేశాడు. 2018 సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించాడు. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద జనవరి 31న హఫీజ్ ను పాక్ ప్రభుత్వం గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. గత నెల 24న కోర్టు ఆదేశాలతో ఆయన విడుదలయ్యారు.
మరోపక్క, సయీద్ రాజకీయాల్లోకి వస్తుండం పట్ల అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన నేర చరిత్రను దృష్టిలో ఉంచుకుని మళ్లీ అరెస్ట్ చేయాలని పాక్ కు తెలిపింది. మరోవైపు ఎంఎంఎల్ ను పార్టీగా పరిగణనలోకి తీసుకోరాదంటూ ఎన్నికల సంఘాన్ని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఎంఎంఎల్ రాజకీయ పార్టీగా అవతరిస్తే... రాజకీయాల్లో కూడా ఉగ్రవాదం, అహింస ఎక్కువవుతాయని పేర్కొంది. ఇలాంటి నేపథ్యంలో, పార్టీ కార్యాలయాన్ని హఫీజ్ ప్రారంభించడం ఆందోళనకర విషయమే.