Vijayawada: కీర్తన 121... నేను నా కన్నులనెత్తి కొండలవైపు పారజూస్తున్నాను..!: స్తోత్రం చదివిన చంద్రబాబు

  • బైబిల్ వాక్యాలు చదివి వినిపించిన చంద్రబాబు
  • విజయవాడ క్రిస్మస్ వేడుకల్లో ఏపీ సీఎం
  • పాల్గొన్న పలువురు ప్రజా ప్రతినిధులు

క్రిస్మస్ వేడుకలు ఆంధ్రప్రదేశ్ లో వైభవంగా జరుగుతున్న వేళ, విజయవాడలో జరిగిన ప్రార్థనల్లో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బైబిల్ లోని కొన్ని వాక్యాలను చదివి వినిపించారు.

 "అందరికీ హ్యాపీ క్రిస్మస్... కీర్తన 121. నేను నా కన్నులనెత్తి కొండలవైపు పారజూస్తున్నాను. నాకు ఎచటి నుంచి సహాయం లభించును. భూమ్యాకాశములు స్పృజించిన ప్రభువు నుంచి నాకు సహాయం లభించును. ఆయన నిన్ను కాలుజారి పడనీయడు. నిన్ను కాపాడు వాడు నిద్రపోడు. ఇజ్రాయిలును కాపాడువాడు కునికిపాట్లు పడడు. నిద్రపోడు. ప్రభువు నిన్ను కాపాడును. నీకు నీడగా ఉండును. ఆయన నీకు కుడిపక్కన నిలిచి నిన్ను రక్షించును. పగలు నీకు సూర్యుడి వలన హాని కలుగదు. రేయి చంద్రుని వలన కీడు కలగదు. ప్రభువు నిన్ను సకల ఆపదల నుంచి కాపాడును...." అంటూ స్తోత్రాన్ని చదివి వినిపించారు.

 ఈ కార్యక్రమంలో బిషప్ రాజారావు, ఫాదర్ ప్రసాద్, ఫాదర్ పాపిరెడ్డి, ఫాదర్ రవిశంకర్, ఫాదర్ జయరాజ్, ఫాదర్ కిశోర్, ఫాదర్ థామస్ లతో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Vijayawada
Chandrababu
Christmas
  • Loading...

More Telugu News