dinakaran: దినకరన్ ఘన విజయంపై జైల్లో ఉన్న శశికళ స్పందన!

  • దినకరన్ విజయంపై ఆనందం
  • కోట్లాది మంది దినకరన్ వెంట ఉన్నారు
  • ఆర్కే నగర్ అభివృద్ధికి కృషి చేయాలి

ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన శశికళ మేనల్లుడు దినకరన్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్ పై ఆయన ఏకంగా 40,707 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు. డీఎంకే అభ్యర్థికైతే డిపాజిట్ కూడా దక్కలేదు. బీజేపీకైతే ఘోర పరాభవమే ఎదురైంది. నోటాకు పడినన్ని ఓట్లు కూడా బీజేపీకి పడలేదు.

ఈ నేపథ్యంలో, బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో ఉన్న శశికళ స్పందించారు. దినకరన్ ఘన విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. జైలు అధికారుల ద్వారా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది మంది కార్యకర్తలు దినకరన్ వెంట ఉన్నారని, ఆయనకు సహాయ సహకారాలు అందిచారని చెప్పారు. అమ్మ జయలలిత రెండుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆర్కే నగర్ అభివృద్ధికి దినకరన్ కృషి చేయాలని తన శుభాకాంక్షల లేఖలో పేర్కొన్నారు.

dinakaran
sashikala
aiadmk
rk nagar polls
sashikala response on dinakaran win
  • Loading...

More Telugu News