nayini narsimha reddy: పేదరికంలో ఉన్న రెడ్డి కుటుంబాలను ఆదుకునేందుకు కేసీఆర్ సిద్ధం: తెలంగాణ హోం మంత్రి

  • పేద రెడ్డి పిల్లల చదువు కోసం రూ. 20 లక్షలు
  • రెడ్ల సంక్షేమానికి సిద్ధంగా ఉన్న కేసీఆర్
  • రెడ్డి సంఘాలన్నీ ఏకం కావాలి

పేద రెడ్డి కుటుంబాలను ఆదుకుంటామని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కుషాయిగుడ రెడ్డి సంక్షేమ సంఘం 5వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన 2018 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంక్షేమ సంఘాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని... రెడ్డి కులస్తుల సమస్యలను పరిష్కరించుకునేందుకు మంచి ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.

 ఇతర కులాల పిల్లలకు ఇస్తున్నట్టుగానే పేద రెడ్డి పిల్లల చదువుల కోసం రూ. 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా రెడ్డి కులస్తులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

nayini narsimha reddy
reddy sankshema sangham
  • Loading...

More Telugu News