New Year: పక్కన అబ్బాయి ఉండాలి సుమా... బెంగళూరులో యువతులకు పోలీసుల 'న్యూ ఇయర్' వార్నింగ్!

  • గత సంవత్సరం అమ్మాయిలకు లైంగిక వేధింపులు
  • ఈ సంవత్సరం జాగ్రత్తలను తీసుకున్నామంటున్న పోలీసులు
  • మగతోడు లేకుండా న్యూ ఇయర్ వేడుకలకు రావద్దని సూచన

2017 సంవత్సరం తొలి రోజుకు స్వాగతం పలికేందుకు బెంగళూరులో పెద్ద సంఖ్యలో రహదారులపైకి వచ్చిన అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించగా, ఈ సంవత్సరం అటువంటివి జరుగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 31న జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనాలని భావిస్తే, మగతోడు తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు. మహిళల కోసం బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 ముఖ్యంగా గత సంవత్సరం ఎంతో మంది అమ్మాయిలు తమను వేధించారని ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం వేడుకలు వైభవంగా జరిగే బ్రిగేడ్ రోడ్డు, ఎంజీ రోడ్లపై మహిళల కోసం మరిన్ని ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని, ఇందుకోసం అక్కడి వ్యాపారులు, పౌర సంఘాలతో సమావేశాలు నిర్వహించామని అన్నారు.

New Year
Bangalore
Herrasment
  • Loading...

More Telugu News