Lalu Prasad Yadav: జైలులో లాలూ తొలిరాత్రి గడిచిందిలా!

  • రాంచీలోని బర్సాముండా జైలులో లాలూ
  • రోటీ, పాలక్ కర్రీని ఇచ్చిన జైలు అధికారులు
  • వీఐపీ గదిలో ఒంటరిగా లాలూ

పశువుల దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి, శిక్ష కోసం ఎదురుచూస్తూ, రాంచీలోని బర్సాముండా జైలుకు వెళ్లిన బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తొలిరోజు జైలులో నిద్రలేని రాత్రిని గడిపారు. ఆయన తనకు కేటాయించిన రూము నుంచి బయటకు రాలేదని, సుదీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయారని జైలు అధికారులు తెలిపారు.

ఆదివారం నాడు ఆయన్ను ఎవరూ కలవలేదని స్పష్టం చేశారు. ఆయనకు 3351 వీఐపీ గదిని కేటాయించామని, తొలి రోజు రోటీ, పాలక్ కర్రీ అందించామని పేర్కొన్నారు. కాగా, సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అపీలు చేస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లేముందు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, తన చివరి శ్వాస వరకూ సామాజిక సమస్యలపై పోరాడుతూనే ఉంటానని ఆయన పేర్కొన్నారు.

Lalu Prasad Yadav
Ranchi
Barsamunda
Jail
  • Loading...

More Telugu News