Swati: మరో స్వాతి... ప్రియుడితో కలిసి భర్తను చంపిన అరుణ!

  • నాలుగేళ్ల క్రితం అరుణకు ఇష్టం లేని వివాహం
  • అప్పటికే సాయిని ప్రేమించిన అరుణ
  • వదిలి ఉండలేక హత్యకు ప్లాన్
  • పోలీసుల అదుపులో నిందితులు

నాగర్ కర్నూలులో సంచలనం సృష్టించిన స్వాతి కేసును మరువక ముందే, కడప జిల్లాలో అరుణ అనే యువతి ప్రియుడితో కలసి భర్తను దారుణంగా హతమార్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాజంపేటలో నివాసం ఉండే అరుణకు నాలుగేళ్ల క్రితం శివతో వివాహం జరిగింది. అంతకుముందే అరుణ, సాయి సుభాష్ అనే యువకుడిని ప్రేమించింది. కానీ పెద్దల ఒత్తిడితో శివను వివాహం చేసుకుంది. వివాహమైన తరువాత సాయితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది.

 ప్రియుడిని వదిలి ఉండలేనని భావించిన ఆమె ఒకసారి అతనితో కలసి వెళ్లిపోగా, పెద్దలు నచ్చజెప్పి వెనక్కు తెచ్చారు. అయినా అతడే కావాలని భావించిన ఆమె, భర్తను కడతేర్చాలని నిర్ణయించుకుని, అందుకు ప్రియుడి సహకారాన్ని కోరింది. సాయి సుభాష్ తో కలసి భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News