Reliance: నాడు పెట్టిన రూ. వెయ్యి నేడు రూ. 20.9 లక్షలు: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ

  • టాప్-20 కంపెనీల్లో రిలయన్స్ ను నిలుపుతా
  • తండ్రి మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నా
  • రిలయన్స్ వార్షికోత్సవ వేడుకల్లో ముఖేష్ అంబానీ

1977లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో పెట్టిన రూ. 1000 విలువ ఇప్పుడు 2009 రెట్లు పెరిగి రూ. 20.90 లక్షలకు పెరిగిందని సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. గ్రూప్ సంస్థల 40వ వార్షికోత్సవ వేడుకల్లో తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తన తండ్రి పాటించిన మార్గదర్శక సూత్రాలకు తానిప్పుడు కూడా కట్టుబడి ఉన్నానని చెప్పారు. వరల్డ్ టాప్-20 ఇండస్ట్రీస్ లో రిలయన్స్ ను నిలపడమే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నానని చెప్పారు.

రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో నిర్వహించిన ఈ వేడుకలకు 50 వేల మందికి పైగా హాజరు కాగా, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1200 ప్రాంతాల్లోని రిలయన్స్ కార్యాలయాల్లో ఈ వేడుకలను లైవ్ ద్వారా చూపించారు.

Reliance
Mukesh Ambani
Anniversary
  • Loading...

More Telugu News