India: పాక్ కిరాతకం... సరిహద్దులు దాటొచ్చి, నలుగురు భారత జవాన్లను ముక్కలు ముక్కలు చేసి పైశాచికత్వం!

  • 400 మీటర్లు చొచ్చుకొచ్చిన బ్యాట్ టీమ్
  • నలుగురిని పట్టుకుని చిత్రహింసలు
  • మృతదేహాలను ముక్కలు చేసి వదిలెళ్లిన పాక్ సైన్యం
  • సైన్యంతో పాటు ఉగ్రవాదులు కూడా...
  • జవాన్ల వీర త్యాగాన్ని మరువబోమన్న సైన్యం

పాకిస్థాన్ సైన్యం, తమకు పట్టుబడిన నలుగురు భారత జవాన్లను అత్యంత దారుణంగా చంపేసింది. జమ్మూ కాశ్మీర్ రాజౌరీ జిల్లాలోని కేరి సెక్టారులో జరిగిన ఈ ఘటనపై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ అధికారి, ముగ్గురు జవాన్లు పాకిస్థాన్ బార్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్)కు పట్టుబడ్డారు. అంతకుముందు బ్యాట్ టీమ్ సరిహద్దులు దాటి 400 మీటర్లు చొచ్చుకొచ్చింది. ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న నలుగురినీ అన్యాయంగా బంధించి చిత్రహింసలకు గురి చేసి దారుణంగా హతమార్చింది. వారి మృతదేహాలను ముక్కలు ముక్కలుగా చేసి, అక్కడే వదిలేసి వెనక్కి వెళ్లిపోయింది.

పాక్ జవాన్లతో పాటు కొంతమంది ఉగ్రవాదులు కూడా బ్యాట్ టీమ్ లో ఉన్నారని సైన్యాధికారి ఒకరు తెలిపారు. సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జవాన్లే లక్ష్యంగా వీరు వచ్చారని తెలిపారు. మేజర్ మోహకార్ ప్రఫుల్లా అంబాదాస్ (32), లాన్స్ నాయక్ గుర్మెయిల్ సింగ్ (34), లాన్స్ నాయక్ కులదీప్ సింగ్ (30), సిపాయి పర్ గత్ సింగ్ (30)లు పాక్ టీమ్ దుర్మార్గానికి బలయ్యారు. మరో జవాను తీవ్ర గాయాలతో తప్పించుకోగా, అతనికి వైద్య చికిత్సను అందిస్తున్నారు.

ఈ ఘటన తరువాత పాక్ సైనిక పోస్టులపై భారత్ భారీ ఎత్తున ప్రతిదాడులకు దిగింది. మేజర్ అంబాదాస్ కు భార్య అవోలీ మోహకార్ ఉన్నారని, గుర్మెయిల్ కు భార్య కుల్ జిత్ కౌర్, కుమార్తె ఉన్నారని కులదీప్ సింగ్ కు భార్య జస్ ప్రీత్ కౌర్, ఇద్దరు చిన్నారులు ఉన్నారని, పర్ గత్ సింగ్ కు భార్య రమన్ ప్రీత్ కౌర్, కుమారుడు ఉన్నారని, వారిని ఆదుకుంటామని అధికారులు వెల్లడించారు. వీరంతా ధైర్యవంతులైన సైనికులని, వీరి త్యాగాన్ని దేశం మరువదని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ సంవత్సరం మే 23న ఇద్దరు జవాన్లను పాక్ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News