Misses Amaravati: 'శ్రీమతి అమరావతిగా' నిలిచిన వర్షిత!
- మేరీస్ స్టెల్లా ఆడిటోరియంలో పోటీలు
- ఫైనల్స్ లో 17 మంది వనితలు
- ప్రశ్నలడిగిన భానుచందర్, సీత
- రెండో స్థానంలో చందన
అమరావతిలో జరిగిన 'శ్రీమతి అమరావతి' ఫైనల్స్ మేరీస్ స్టెల్లా ఆడిటోరియంలో వైభవంగా జరుగగా, వర్షిత విజేతగా ఎంపికైంది. తేజాస్ ఎలైట్ ఈవెంట్స్, షానూస్ మీడియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, తెలుగుదనాన్ని ప్రతిబింబిస్తూ, సంప్రదాయ వస్త్రాధరణలో పోటీల్లో పాల్గొన్న 30 మంది వనితల నుంచి 17 మందిని ఫైనల్స్ కు ఎంపిక చేసి వారికి కొన్ని ప్రశ్నలు సంధించి, విజేతలను ఎంపిక చేశారు.
సంస్కృతి, సంప్రదాయం, భాష, పరిశుభ్రత, స్వచ్ఛభారత్ తదితర అంశాలపై నటుడు భానుచందర్, నటి సీత ప్రశ్నలు అడిగి, వర్షితను 'శ్రీమతి అమరావతి'గా ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. రెండో స్థానంలో చందన, మూడో స్థానంలో అపర్ణ నిలిచారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ నిర్మాతల విభాగం వైస్ చైర్ పర్సన్ నాగులపల్లి సజ్జని, ఫ్యాషన్ డిజైనర్ అంజనా మైత్రిదాస్ లు విజేతలకు బహుమతులు అందించారు.