Harika: స్టోరీలో కొత్త ట్విస్ట్... నటి హారికపై డైరెక్టర్ యోగి మరిన్ని ఆరోపణలు... వాట్స్ యాప్ మెసేజ్ ల విడుదల!

  • స్నేహితుడితో హారిక గురించి మంచిగానే చెప్పిన యోగి
  • పబ్బులకు రాదని స్పష్టంగా చెప్పానంటున్న యోగి
  • ఆర్థిక లావాదేవీల సంభాషణలనూ బయటకు చూపిన యోగి
  • ఎవరూ పతివ్రతలు కాదంటూ మెసేజ్ పెట్టిన హారిక

షార్ట్ ఫిల్మ్ నటి హారికపై దర్శకుడు యోగి కొత్త విమర్శలు చేశాడు. వీరిద్దరి మధ్యా విభేదాలు రావడం, హారిక ఫిర్యాదుతో పోలీసు స్టేషన్లో అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి, కాలితో యోగిని తన్నుతున్న దృశ్యాలు బయటకు రావడం నిన్న కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ టీవీ చానల్ తో మాట్లాడిన యోగి, తనకు, హారికకు మధ్య జరిగిన వాట్స్ యాప్ సంభాషణలను బయట పెట్టాడు.

తన వ్యక్తిగత విషయాలను ఎందుకు బయట పెట్టావని హారిక ప్రశ్నించగా, తాను అటువంటి పని ఎన్నడూ చేయలేదని సమాధానం ఇస్తున్న మెసేజ్ లను చూపించాడు. తనకు, తన స్నేహితుడికి హారిక ప్రవర్తనపై జరిగిన సంభాషణనూ ఆయన విడుదల చేశాడు. మాట్లాడుకోవడానికి ఆమె వస్తుందే తప్ప పబ్బుకు రమ్మంటే రాదని, అడిగితే హాట్ గా రిప్లై వస్తుందని యోగి టైప్ చేయగా, అతని స్నేహితుడు ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని, అంతకు ముందు కూడా ఆమెను ఆహ్వానించానని చెప్పాడు. తనను అడ్డు పెట్టుకుని ఆమెను వాడేశావా? అని యోగి ప్రశ్నించగా, ఒకరిని ఒకరు అప్పుడప్పుడూ వాడాలి కదా అన్నా? అన్న సమాధానం అవతలి నుంచి వచ్చింది.

తనకు హారిక డైరీ తెలుసని, రాత్రుళ్లు అమె బయటకు రాదని, వీకెండ్స్ లో అసలు కుదరదని యోగి చెప్పగా, భర్తతో కలసి వస్తానని అమె చెప్పినట్టు ఇందులో ఉంది. ఇంకా యోగి, హారికల మధ్య డబ్బు లావాదేవీల విషయంలో జరిగిన మెసేజ్ సంభాషణలనూ యోగి చూపించాడు. ఎమౌంట్ ఇంకా సర్దుబాటు కాలేదని, రేపు బ్యాంక్ లో వేస్తానని, "అందరికీ ఉన్నవీ లేనివీ చెబుతున్నావు కదా? ఇంక చెయ్యాల్సింది ఏమీ లేదు. ఇకపై నా ట్రయల్స్ నేనే వేసుకుంటా" అని యోగి చెబితే, "ఎవరూ పతివ్రతలు కారు. అందరూ ఏదో ఒక తప్పు చేసేవాళ్లే. నేను ఏమీ బాధపడటం లేదు. నన్ను భయపెట్టాలని చూడకు. నా అన్ని సీక్రెట్స్ ఈకతో సమానం నాకు. అసలు భయపడను. ఎవరితోనైనా ట్రాన్స్ పరెంట్ గా ఉంటాను. నా రిలేషన్స్ సీక్రెట్ కూడా కావు" అన్న హారిక మెసేజ్ లను చూపించాడు. ఆ అమ్మాయిని గురించి చూపించిన వీడియోలు అన్నీ క్రియేట్ చేసినవేనని ఆరోపించాడు.

Harika
Yogi
Short Film
Arrest
Gangireddy
  • Loading...

More Telugu News