monkey: కోతి మృతదేహాన్ని ఊరేగించి ఖననం చేసి, సమాధి కట్టి.. అన్న‌దానం చేసిన వైనం!

  • క‌డ‌ప జిల్లా లింగాల మండల కేంద్రంలో ఘ‌ట‌న‌
  • ఇటీవ‌లే ఓ వృద్ధ వానరం మృతి
  • కోతి సమాధి వద్ద ప్రత్యేక పూజలు

ఓ గ్రామ‌స్తులు కోతి మృతదేహాన్ని ఊరేగించి, ఖననం చేసి, సమాధి కట్టి అనంత‌రం అన్నదానం చేసిన ఘ‌ట‌న క‌డ‌ప జిల్లా లింగాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. త‌మ గ్రామంలోని ఓ వృద్ధ వానరం ఇటీవ‌ల చ‌నిపోగా గ్రామ‌స్తులు ఈ తంతు నిర్వ‌హించారు. ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఖననం చేసి, ఈ రోజు అన్న‌దానం చేశారు. కోతి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ‌ ప్రజలంద‌రూ ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఓ మ‌నిషికి చ‌నిపోతే చేసే ప‌నుల‌న్నీ ఆ గ్రామ‌స్తులు వాన‌రానికి చేశారు. 

  • Loading...

More Telugu News