bellamkonda srinivas: యంగ్ హీరోకి తల్లిగా సీనియర్ హీరోయిన్ మీనా!

  • శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం'
  • బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా పూజా హెగ్డే 
  • ఫిబ్రవరి 9న విడుదల

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నిన్నటి తరం కథానాయికగా మీనా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో ఆ మధ్య వచ్చిన 'దృశ్యం' .. ఈ మధ్య వచ్చిన 'మామ మంచు అల్లుడు కంచు' సినిమాల్లో తన వయసుకు తగిన పాత్రల్లో నటించింది. అలాంటి మీనా తాజాగా మరో తెలుగు సినిమాలో నటిస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా .. పూజా హెగ్డే హీరోయిన్ గా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకి 'సాక్ష్యం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో మీనా నటిస్తోందట. హీరో తల్లి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటంతో, మీనా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నట్టుగా సమాచారం. ఆమె పాత్ర సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. అభిషేక్ నామా నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 

bellamkonda srinivas
pooja hegde
meena
  • Loading...

More Telugu News