shiva karthikeyan: తమిళ పైరసీ మాఫియాను బతిమాలుకున్న దర్శకుడు!

  • రీసెంట్ గా రిలీజైన 'వేలైక్కారన్'
  • శివకార్తికేయన్ .. నయనతార కాంబినేషన్ 
  • ఆడియన్స్ నుంచి లభిస్తోన్న ఆదరణ

తమిళ రాకర్స్ అనే వెబ్ సైట్ పేరు చెబితే అక్కడి దర్శక నిర్మాతలు హడలిపోతారు. అందుకు కారణం కొత్త సినిమాలను ఎలాంటి బెరుకు లేకుండగా వాళ్లు పైరసీ చేస్తుంటారు. వాళ్లను కట్టడి చేయడానికి చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నా ప్రయోజనం మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో .. "ఈ ఒక్కసారికి మా సినిమాను కొంచెం ఆలస్యంగా మీ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయండి" అంటూ తమిళ రాకర్స్ ను ఉద్దేశించి దర్శకుడు మోహన్ రాజా అనడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 శివకార్తికేయన్ .. నయనతార జంటగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే పైరసీ మాఫియాని ఉద్దేశించి మోహన్ రాజా ఇలా బతిమాలుకున్నాడు. తమిళ సినిమా పరిశ్రమ పైరసీ మాఫియా చేతిలో ఎంతలా బందీ అయిందనే విషయానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదని అక్కడి జనాలు చెప్పుకుంటున్నారు.  

shiva karthikeyan
nayanatara
  • Loading...

More Telugu News