Pawan Kalyan: అదే జరిగితే.. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు: పవన్ కల్యాణ్

  • అన్యాయం జరిగినప్పుడు అధికారులు ప్రేక్షకపాత్ర వహించరాదు
  • దళిత మహిళకు కలెక్టర్, ఎస్పీ న్యాయం చేయాలి
  • సెన్సేషన్ కోసం మీడియా పాకులాడరాదు

విశాఖపట్నం పెందుర్తిలో దళిత మహిళపై జరిగిన దాడికి సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే చర్య తీసుకోవాలని... నిస్సహాయ మహిళకు అండగా నిలబడాలని విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరుతున్నానని ఆయన అన్నారు. అభాగ్యురాలికి వెంటనే న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు.

రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులకు ఏ ఒక్క వ్యక్తి కాని, ఏ ఒక్క వర్గం కానీ భంగం కలిగిస్తే... అలాంటివారిని అధికారులు క్షమించరాదని అన్నారు. ఒకవేళ అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తే... చట్టాన్ని ప్రజలు తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. సెన్సేషన్ కోసం మీడియా పాకులాడరాదని... బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలని కోరారు.

Pawan Kalyan
visakhapatnam dalit woman
  • Loading...

More Telugu News