addl dcp gangi reddy: దర్శకుడు యోగిని బూటు కాలితో తన్ని, లెంపలు వాయించిన అడిషనల్ డీసీపీ.. వీడియో వైరల్!

  • షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ పై అడిషనల్ డీసీపీ వీరంగం
  • విచారణ పేరుతో బూటు కాలితో తన్నిన వైనం
  • వెలుగుచూసిన వీడియో

విచారణ పేరిట పోలీసులు నిందితులను శారీరక హింసకు గురిచేసే సంఘటనలను అప్పుడప్పుడు మనం చూస్తూనే వున్నాం. తాజాగా ఓ అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి అలాంటి పనికి ఒడిగట్టడం ఇప్పుడు హైదరాబాదులో సంచలనమైంది. వివరాల్లోకి వెళ్తే, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి తనను వేధింపులకు గురి చేశాడంటూ నటి హారిక గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి యోగిని తన కార్యాలయానికి పిలిపించుకుని... అతనిపై దారుణంగా ప్రవర్తించారు. పోలీసుల ఎదుటే యోగిని బూటు కాలితో నిర్దాక్షిణ్యంగా తన్ని, చెంపలు పగలగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. విచారించడానికి ఓ పద్ధతి ఉంటుందని, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి ఇంత హేయంగా ప్రవర్తించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. వీడియోను మీరూ చూడండి.

  • Loading...

More Telugu News