Telangana: మేము నిర్వహించింది తెలంగాణ మహాసభలు కాదు!: నందిని సిధారెడ్డి

  • మూడు లక్ష్యాలతో ఈ మహాసభలు నిర్వహించాం
  • వంద శాతం లక్ష్యాన్ని సాధించాం
  • ఒక సంకల్పంతో నిర్వహించి విజయం సాధించాం: సిధారెడ్డి

తాము నిర్వహించింది ప్రపంచ తెలుగు మహాసభలని, తెలంగాణ మహాసభలు కాదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి స్పష్టం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నిర్వహించింది ప్రపంచ తెలుగు మహాసభలే అయినప్పటికీ, తెలంగాణ ఘనతను, వైభవాన్ని ప్రపంచ తెలుగు ప్రజలందరి ముందర చాటి చెప్పేందుకు ఏర్పాటు చేసిన సభలు ఇవని అన్నారు.

ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఆహ్వానించాలంటే ఒక సంవత్సర కాలమైనా చాలదని, ఎవరిని ఆహ్వానించాలి, ఏం చెప్పాలి, ఎలా నిర్వహించాలనే వాటిపై తమకు ఉన్న స్పష్టతతో, ఒక సంకల్పంతో ఈ మహాసభలను నిర్వహించి విజయం సాధించామని, ఈ మహాసభల ద్వారా వంద శాతం లక్ష్యాన్నిఅందుకున్నామని చెప్పారు.

‘తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి వికాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేది మా మొదటి లక్ష్యం. తెలంగాణలోని మహనీయులు, గొప్ప కవులను గుర్తుచేసుకుని, వాళ్ల కృషిని జ్ఞాపకం చేసుకోవడమనేది రెండోది లక్ష్యం. ఇప్పటి తరం ఆంగ్ల మాధ్యమం వలయంలో చిక్కుకుని సతమతమవుతున్నారు. ఆ మాధ్యమంలో చిక్కుకున్నటు వంటి కొత్త తరాన్ని తెలుగు భాష వైపు మళ్లించాలనేది మూడో లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News