mrps: రెచ్చిపోయిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు.. మంత్రి తుమ్మల కాన్వాయ్‌పై రాళ్ల దాడి
- సూర్యాపేట హైవేపై ఎమ్మార్పీఎస్ ఆందోళన
- తుమ్మల కాన్వాయ్ పై రాళ్లు విసిరిన కార్యకర్తలు
- కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం!
ఎస్సీ వర్గీకరణపై టీఆర్ఎస్ ప్రభుత్వం తమ వైఖరి స్పష్టం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమించడం, ఈ క్రమంలో మంద కృష్ణమాదిగను ముందస్తు అరెస్టు చేయడం, దీంతో కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నిరసన సెగ హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు పాకింది.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఈరోజు మధ్యాహ్నం సూర్యాపేట హైవేపై ఆందోళనకు దిగారు. అదే సమయంలో, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ వెళుతుండటంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. కాన్వాయ్ పై రాళ్లు విసిరారు. ఈ సంఘటనలో ఒక కారు అద్దాలు పూర్తిగా పగిలిపోయినట్టు తెలుస్తోంది. వెంటనే పోలీసులు వారిని చెదరగొట్టారు.