Rajinikanth: సందేహం వద్దు.. ర‌జ‌నీ రాజ‌కీయ‌ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తారు: ర‌జ‌నీ ఆత్మీయ మిత్రుడు మణియన్‌

  • చెన్నైలో మణియన్‌తో ర‌జ‌నీ భేటీ
  • రాజ‌కీయ ప్ర‌వేశంపై చ‌ర్చ‌?
  • ఈ నెల 26 నుంచి 31 మ‌ధ్య‌లో ఏ రోజ‌యినా ర‌జ‌నీ ప్ర‌క‌ట‌న చేయొచ్చు

సౌతిండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ రోజు చెన్నైలో ప్ర‌ముఖ‌ రాజకీయ వేత్త, రచయిత, త‌న ఆత్మీయ మిత్రుడు మణియన్‌తో భేటీ అయిన విష‌యం తెలిసిందే. త‌న‌ రాజ‌కీయ ప్ర‌వేశంపైనే ర‌జనీ ఆయ‌న‌తో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ఈ భేటీ ముగిసిన వెంట‌నే మ‌ణియ‌న్ మీడియాతో మాట్లాడుతూ ప‌లు విష‌యాలు తెలిపారు. అభిమానుల‌తో భేటీ అయిన సంద‌ర్భంలోనే ర‌జ‌నీకాంత్ త‌న రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. ఈ నెల 26 నుంచి 31 మ‌ధ్య‌లో ఏ రోజ‌యినా ర‌జ‌నీ ప్ర‌క‌ట‌న చేయొచ్చ‌ని వ్యాఖ్యానించారు. ర‌జ‌నీ రాజ‌కీయ ప్ర‌వేశంపై ఎటువంటి సందేహాలు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

  • Loading...

More Telugu News