KCR: ఈ అవార్డుకు రచయిత దేవిప్రియ సంపూర్ణంగా అర్హుడు: సీఎం కేసీఆర్

  • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై హర్షం
  • అనువాద విభాగంలో ఈ పురస్కారం దక్కిన వల్లభరావుకూ అభినందనలు
  • ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ 

సుప్రసిద్ధ కవి, రచయిత దేవిప్రియ (షేక్ ఖాజా హుస్సేన్) కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ అవార్డును అందుకునేందుకు ఆయన సంపూర్ణంగా అర్హుడని ప్రశంసించారు. ఈ సందర్భంగా దేవిప్రియకు అభినందనలు తెలిపారు.

అలాగే, అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన మరో రచయిత వెన్నా వల్లభరావుకు కూడా కేసీఆర్ అభినందనలు తెలిపారు. కాగా, ‘గాలి రంగు’ కవితా సంపుటికి గాను దేవిప్రియకు, అనువాద విభాగంలో ‘విరామమెరుగని పయనం’ పుస్తకానికి వల్లభరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు దక్కాయి. 

KCR
devi priya
  • Loading...

More Telugu News