mumbai: ప్రియాంక‌చోప్రా రూ. 5 కోట్ల డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న రిహార్స‌ల్స్‌ ఇదే!

  • వీడియో షేర్ చేసిన న‌టి
  • జీ సినీ అవార్డుల వేడుకలో ప్రియాంక ప్ర‌ద‌ర్శ‌న‌
  • త్వ‌ర‌లో టీవీలో ప్ర‌సారం

ఇటీవ‌ల ముంబైలో జ‌రిగిన ఓ అవార్డుల వేడుక‌లో 5 నిమిషాల‌ డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న కోసం అంత‌ర్జాతీయ న‌టి ప్రియాంక చోప్రా రూ. 5 కోట్ల రూపాయ‌లు తీసుకుందంటూ వార్తలు వ‌చ్చాయి. ఆ డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌కు సంబంధించిన రిహార్స‌ల్స్ వీడియోను ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది.

జీ సినీ అవార్డుల వేడుక స్టేజీ మీద ప్రియాంక‌ రిహార్స‌ల్స్ చేయ‌డం, ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందు బ్యాక్ స్టేజీ దృశ్యాలు, రెడ్ కార్పెట్ మీద హొయ‌లు పోవ‌డం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ అవార్డుల కార్య‌క్ర‌మం త్వ‌ర‌లో టీవీలో ప్ర‌సారం కానుంది. ప్ర‌స్తుతం క్రిస్‌మ‌స్ సంద‌ర్భంగా హాలీడే సీజ‌న్ అవ‌డంతో ప్రియాంక, స్వ‌దేశానికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News