Amitabh Bachchan: నాకు ప్రాణం పోసింది బాల్ థాకరేనే: అమితాబ్ బచ్చన్
- ప్రమాదానికి గురైనప్పుడు సేన అంబులెన్స్ నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లింది
- థాకరేను చివరి స్టేజ్ లో చూసి, తట్టుకోలేకపోయా
- 'థాకరే' సినిమా షూటింగ్ ప్రారంభం
'కూలీ' సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ఆయన చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. తాజాగా ఆ ప్రమాదంపై అమితాబ్ మాట్లాడుతూ, అప్పుడు తన ప్రాణాలు కాపాడింది శివసేన అధినేత, దివంగత బాల్ థాకరే అని చెప్పారు.
అప్పుడు బాగా వర్షం పడుతోందని, అంబులెన్స్ లు కూడా లభించే పరిస్థితి లేదని, చివరకు శివసేనకు చెందిన అంబులెన్సే తనను ఆసుపత్రికి తీసుకెళ్లిందని తెలిపారు. బాల్ థాకరే బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అమితాబ్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. థాకరే చనిపోవడానికి ముందు, ఆయనకు చికిత్స జరుగుతున్న గదిలోకి వెళ్లానని, అలాంటి స్థితిలో ఆయనను చూసి తట్టుకోలేక పోయానని చెప్పారు.